LOADING...
Keerthy Suresh: కీర్తి సురేష్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్‌ రీటా'.. రిలీజ్ డేట్ ఫిక్స్
కీర్తి సురేష్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్‌ రీటా'.. రిలీజ్ డేట్ ఫిక్స్

Keerthy Suresh: కీర్తి సురేష్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్‌ రీటా'.. రిలీజ్ డేట్ ఫిక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
06:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ అందాల నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'రివాల్వర్‌ రీటా'. మహిళా ప్రాధాన్యతతో కూడిన కథతో రూపొందుతున్న ఈ సినిమాకు జేకే చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్రబృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రత్యేకంగా రూపొందించిన అనౌన్స్‌మెంట్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా రిలీజ్ డేట్‌ను వెల్లడించారు.

వివరాలు 

పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌

ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కావడంతో, వినాయక చవితి సందర్భంగా ఈ సంవత్సరం ఆగస్టు 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని కీర్తి సురేశ్ స్వయంగా పోస్టర్‌ను షేర్ చేస్తూ ప్రకటించారు. తాజాగా విడుదలైన వీడియోను చూస్తే, ఇది పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమాలో రెడిన్‌ కింగ్‌స్లీ, మైమ్‌ గోపీ, సెండ్రాయిన్, స్టంట్ మాస్టర్ సూపర్‌ సుబ్బరాయన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఫ్యాషన్‌ స్టూడియోస్, ది రూట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

వివరాలు 

ఉత్తమ నటి విభాగంలో జాతీయ అవార్డు

కీర్తి సురేశ్ బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి,తన నటనా ప్రతిభతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. 'మహానటి' సినిమాలో తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. కోలీవుడ్‌లో 'ఇదు ఎన్ని మాయం' చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఆమె, అక్కడే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. కథానాయికగా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న కీర్తి సురేశ్, తెలుగులో దివంగత నటి సావిత్రి జీవితకథ ఆధారంగా రూపొందిన 'మహానటి' చిత్రంలో మెరిసి, ఉత్తమ నటి విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. నటిగా ఆమె వేసిన ప్రతి అడుగు ఆమె స్థాయిని పెంచుతూ వచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టారు. వరుణ్ ధావన్ సరసన 'బేబీజాన్‌' అనే హిందీ చిత్రంలో నటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కీర్తి సురేష్ చేసిన ట్వీట్