Keerthy Suresh: చిరకాల స్నేహితుడితో ఏడడుగులు నడిచిన కీర్తి సురేష్.. పెళ్లి ఫోటోలు వైరల్!
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా తన ప్రియుడైన ఆంటోనీ తట్టిళ్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గోవాలో డిసెంబర్ 12వ తేదీన ఈ జంట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. పెళ్లి వేడుకలో కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. కీర్తీ సురేష్, ఆంటోనీ తట్టిళ్ మధ్య స్కూల్ డేస్ నుంచే పరిచయం ఉంది. కాలేజీ రోజులలో ఈ పరిచయం ప్రేమగా మారింది. తన ప్రేమికుడి వివరాలను గోప్యంగా ఉంచిన కీర్తీ, ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ వివాహంపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ
కీర్తీ సురేష్ ప్రస్తుతం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ఆమె నటిస్తున్న బేబీ జాన్ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. తమిళంలో రివాల్వర్ రీటా, కన్నేవీడి, వెబ్ సిరీస్ అక్కాలోనూ ఆమె నటిస్తోంది. ఆంటోనీ తట్టిళ్ కేరళకు చెందిన వ్యాపారవేత్త. అతని వ్యాపారాలు కేరళలోని ప్రముఖ రిసార్ట్ చైన్‌ను కూడా కలిగి ఉన్నాయి. ఇంజినీరింగ్ చదివిన ఆంటోనీ కొంతకాలం విదేశాల్లో పనిచేశాడు. ప్రస్తుతం అతనికి కేరళలో పలు బిజినెస్‌లు ఉన్నాయి అతనికి దాదాపు రూ.300 కోట్ల నెట్ వర్త్ ఉన్నట్లు తెలుస్తోంది