Page Loader
Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక ట్విస్ట్.. బెంగాల్‌లో మహిళ అరెస్టు
సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక ట్విస్ట్.. బెంగాల్‌లో మహిళ అరెస్టు

Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక ట్విస్ట్.. బెంగాల్‌లో మహిళ అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2025
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసిన ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌ నుండి ఒక మహిళను అరెస్టు చేశారు. సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు ఉపయోగించిన సిమ్‌ కార్డు ఈ మహిళ పేరుతో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌ నదియా జిల్లా చపరాకు చెందిన ఈ మహిళకు సైఫ్‌పై దాడి చేసిన నిందితుడితో పరిచయం ఉంది. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారత్‌ వచ్చిన నిందితుడు ఆమెతో సంబంధం కొనసాగించాడని పోలీసులు తెలిపారు.

Details

కేసును వేగవంతం చేసిన పోలీసులు

ముంబయి పోలీసులు ఈ మహిళను అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్‌ పోలీసులు వెల్లడించారు. ఇక సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో అరెస్టైన షరీఫుల్ ఇస్లాంలోని వేలిముద్రలు, దాడి జరిగిన ప్రదేశం నుండి లభించిన ఫింగర్‌ ప్రింట్స్‌ సరిపోలడం లేదని సమాచారం. దీంతో పోలీసులు తదుపరి పరీక్షల కోసం ఘటనా స్థలం నుంచి మరిన్ని నమూనాలను సేకరించాలని నిర్ణయించారు.