LOADING...
Kingdom : కింగ్ డమ్ మరోసారి వాయిదా..? వెనక్కి తగ్గిన మేకర్స్!
కింగ్ డమ్ మరోసారి వాయిదా..? వెనక్కి తగ్గిన మేకర్స్!

Kingdom : కింగ్ డమ్ మరోసారి వాయిదా..? వెనక్కి తగ్గిన మేకర్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్ డమ్' మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. తొలుత మే 30న విడుదల చేస్తామని ప్రకటించినా, అనంతరం విడుదల తేదీని జులై 4కి మార్చారు. అయితే తాజా పరిణామాల ప్రకారం ఆ తేదీ కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మార్పుకు ప్రధాన కారణం నితిన్ నటించిన 'తమ్ముడు' సినిమా. అదే జులై 4న రిలీజ్ కావాలని అధికారికంగా ప్రకటించడంతో, 'కింగ్ డమ్' మేకర్స్ కొంత వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. మొదట 'తమ్ముడు'తో బాక్సాఫీస్ పోటీలోకి దిగేందుకు సిద్దమయ్యారు గానీ, ఇప్పుడు ఆ నిర్ణయం మారినట్టు సమాచారం.

Details

హరిహర వీరమల్లు వాయిదా

ఇక మరోవైపు, పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా కూడా జూన్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా, అది వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా జులై మొదటి వారంలోనే థియేటర్లలోకి రానుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'కింగ్ డమ్' మేకర్ నాగవంశీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇందుకు తోడుగా వీరమల్లు టీమ్ ఇటీవల ముంబైలో అమేజాన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ముందుగానే అడ్వాన్స్ చెల్లించిన అమేజాన్, వీరమల్లును త్వరగా రిలీజ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అందువల్లే ఆ సినిమా విడుదల వేగవంతం అవుతోంది.

Details

జులై మొదటి వారంలో రిలీజయ్యే అవకాశాలు ఎక్కువ

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, వీరమల్లు జులై మొదటి వారంలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కూడా ఒకటి, రెండు రోజుల్లో రావచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో 'కింగ్ డమ్' మళ్లీ వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే, కింగ్ డమ్ మేకర్స్ భారీ పోటీ మధ్య సినిమాను రిలీజ్ చేయాలని అనుకోవడం లేదు. బాక్సాఫీస్ పై సోలోగా దూసుకెళ్లాలని భావిస్తున్నారు. అందుకే జులై 25వ తేదీకి వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, పరిస్థితులు చూస్తుంటే 'కింగ్ డమ్' వాయిదా తప్పదని స్పష్టమవుతోంది. మరి చివరకు ఏ తేదీని లాక్ చేస్తారో వేచి చూడాల్సిందే.