తదుపరి వార్తా కథనం
Kiran Abbavaram: తండ్రి కాబోతున్నట్లు ప్రకటించిన కిరణ్ అబ్బవరం.. సోషల్ మీడియాలో ఫోటో షేర్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 21, 2025
12:30 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం ఆనందదాయకమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు.
అతను తండ్రి కాబోతున్నట్లు తెలుపుతూ మంగళవారం ఉదయం ఒక ప్రత్యేక పోస్ట్ షేర్ చేశారు.
పోస్ట్‌లో తన సతీమణి రహస్యతో కలిసి దిగిన ఒక అందమైన ఫోటోను పంచుకుంటూ 'మా ప్రేమ పెరుగుతోంది' అని క్యాప్షన్ ఇచ్చారు.
ఈ సందర్బంగా అందరి ఆశీస్సులు కావాలని కోరుకున్నారు. నెటిజన్లు కిరణ్-రహస్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Details
2019లో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం 2019లో విడుదలైన రాజావారు.. రాణిగారు చిత్రం ద్వారా టాలీవుడ్‌లో ప్రవేశించారు.
ఇందులో రహస్య హీరోయిన్‌గా నటించారు. షూటింగ్ సమయంలో స్నేహం ప్రారంభమై, అది ప్రేమగా మారింది.
2023 ఆగస్టులో ఈ జంట వివాహమైతే, తమ కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వివాహం జరిపారు.
ఇటీవలి కాలంలో కిరణ్ 'క' సినిమా ద్వారా బ్లాక్‌బస్టర్ విజయం సాధించారు.