Page Loader
Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్' నుంచి

Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్' నుంచి "క్యా ల‌ఫ్డా" లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2024
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

"డబుల్ ఇస్మార్ట్" నుండి మూడవ పాట విడుదలైంది. రామ్ పోతినేని,కావ్య థాపర్ ల పై చిత్రీక‌రించిన "క్యా లఫ్దా" పాట పూర్తి రొమాంటిక్ మెలోడీగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. మ‌ణిశ‌ర్మ మ‌రోసారి త‌న మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. శ్రీ‌హ‌ర్ష ఈమ‌ని లిరిక్స్ అందించిన ఈ పాట‌ను ధ‌నుంజ‌య్, సింధుజ శ్రీ‌నివాస‌న్ క‌లిసి పాడారు. ఈ సినిమాకి దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాధ్. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం,హిందీ, కన్నడ,మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో బన్ని జె, అలీ, గెటప్ శ్రీను, సాయాజీ షిండే, మకరంద్ దేశ్‌పాండే, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పూరి కనెక్ట్స చేసిన ట్వీట్