LOADING...
Lakshmi Menon: : ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన కేసులో ముగ్గురి అరెస్ట్, పరారీలో నటి లక్ష్మీ మీనన్‌
Lakshmi Menon: : ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు.. పరారీలో నటి లక్ష్మీ మీనన్‌

Lakshmi Menon: : ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన కేసులో ముగ్గురి అరెస్ట్, పరారీలో నటి లక్ష్మీ మీనన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2025
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటనలో ప్రముఖ తమిళ నటి లక్ష్మీ మీనన్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదైంది. ఎర్నాకులం నార్త్ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం,ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. ఒక రెస్టారెంట్ బార్ వద్ద నటి లక్ష్మీ మీనన్ గ్యాంగ్ సభ్యులు,బాధితుడి స్నేహితుడి మధ్య వాగ్వాదం జరిగింది.

వివరాలు 

ముగ్గురిని అరెస్టు చేసిన  పోలీసులు 

ఆ గొడవ తరువాత, లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు బాధితుని వెంట వెంబడి, అతని కారును అడ్డగించారు. అనంతరం, అతడిని బలవంతంగా తమ కారులోకి తీసుకెళ్లి దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. మిథున్, అనీష్, సోనామోల్ అనే ముగ్గురిని ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నటి లక్ష్మీ మీనన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని.. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుందని, ఆమెను పట్టుకోవడానికి అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పరారీలో నటి లక్ష్మీ మీనన్‌