Page Loader
Devara: 'దేవర' ఫస్ట్ సింగిల్‌కి సంబంధించి అప్‌డేట్
Devara: 'దేవర' ఫస్ట్ సింగిల్‌కి సంబంధించి అప్‌డేట్

Devara: 'దేవర' ఫస్ట్ సింగిల్‌కి సంబంధించి అప్‌డేట్

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2024
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ గ్లామరస్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న చిత్రం'దేవర'. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ ఏడాది అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు మేకర్స్.ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం, లిరికల్ వీడియోకి సంబంధించిన పని జరుగుతోంది.ఈ పాట విడుదల తేదీకి సంబంధించి రేపు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీం కొరటాల చేసిన ట్వీట్