
MAD Square: ఓటీటీలోకి వచ్చేసిన 'మ్యాడ్ స్క్వేర్'..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మించిన తాజా చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'.
ఈ సినిమా,గతంలో విడుదలైన'మ్యాడ్'చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించబడింది.
మొదటి భాగంలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ బావ నార్నే నితిన్, అలాగే నటుడు సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ లతో పాటు మరికొంతమంది ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈసినిమాకు దర్శకుడిగా కళ్యాణ్ శంకర్ బాధ్యతలు చేపట్టగా,నిర్మాణ బాధ్యతలు నాగవంశీ నిర్వహించారు.
ఏప్రిల్ 1వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్లో విడుదల అయ్యింది.
తెలుగు భాషతో పాటు,తమిళం,కన్నడ, మలయాళం,హిందీ భాషల్లోనూ ఇప్పుడు ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
వివరాలు
కథ సారాంశం:
ఈ సీక్వెల్ కథ మొదటి భాగం చివరలోని ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో జరిగిన మ్యాడ్ గ్యాంగ్ కథను కొనసాగిస్తుంది.
కాలేజ్ జీవితానికి వీడ్కోలు చెప్పిన తరువాత, ప్రధాన పాత్రలైన మనోజ్, అశోక్, దామోదర్ తాము ఆసక్తి కలిగిన రంగాల్లో తమ కెరీర్ ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు.
ఇలాంటి సమయంలో, ఈ గ్యాంగ్‌లోని సభ్యుడు లడ్డూ (విష్ణు) పెళ్లి కుదిరిందన్న వార్త తెలుసుకుంటారు.
అందరూ కలిసి అతని పెళ్లికి హాజరవడానికి వెళ్లిపోతారు. కానీ పెళ్లి జరిగే ముందు, లడ్డూ పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి పారిపోతుంది.
దాంతో ఈ గ్యాంగ్ లడ్డూని తీసుకుని పెళ్లి లేకుండానే గోవాకి హనీమూన్ ట్రిప్‌కి బయలుదేరుతుంది.
వివరాలు
కథ సారాంశం:
గోవాలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. ఒక మ్యూజియంలో జరిగిన బంగారు గొలుసు దొంగతనం కేసులో ఈ నలుగురు ఇరుక్కుంటారు.
అంతేకాకుండా లడ్డూ తండ్రి (మురళీధర్ గౌడ్) ను ఓ గ్యాంగ్ లీడర్ అయిన భాయ్ (సునీల్) ఎందుకు కిడ్నాప్ చేశాడనేది రహస్యంగా మిగిలిపోతుంది.
ఇదే సమయంలో లైలా అనే కొత్త పాత్ర గోవాలో వీరికి పరిచయమవుతుంది.
ఈమె ఎవరు? ఆమె పాత్ర కథలోకి ఎలా ప్రవేశించిందనే విషయం తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని పూర్తిగా చూడాల్సిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెట్ ఫ్లిక్స్ సౌత్ చేసిన ట్వీట్
Mamulgane veelatho MAD mad untadhi, inka laddu pelli ante MAD MAXX ey 😎🔥
— Netflix India South (@Netflix_INSouth) April 25, 2025
Watch Mad Square, now on Netflix in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.#MadSquareOnNetflix pic.twitter.com/35PvMZpKpT