Mahesh Babu: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన మహేష్ బాబు.. సూపర్ స్టార్ లుక్‌తో ఫ్యాన్స్ ఫిదా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలిశారు. వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ. 50 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మహేశ్‌బాబు పొడవాటి జుత్తు, గడ్డంతో ఉన్న లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మహేశ్‌బాబు తన తదుపరి చిత్రం SSMB 29లో ఈ న్యూలుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనుంది.
ప్రత్యేక లుక్స్ ను సిద్ధం చేస్తున్న జక్కన్న
భారతీయ చిత్ర పరిశ్రమలో చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరిస్తున్నట్లు రచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల తెలిపారు. ఈ చిత్రం అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని, ఇందులో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని అనువదించనున్నారు. కె.ఎల్. నారాయణ దుర్గా ఆర్ట్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'గరుడ' అనే టైటిల్‌ను పెట్టినట్లు సమాచారం. మహేశ్‌కు సంబంధించిన ఎనిమిది ప్రత్యేక లుక్స్‌ను జక్కన్న టీమ్ సిద్ధం చేసినట్లు సమాచారం.