Varanasi : దేవర సెట్స్‌లో మహేష్ బాబు.. రాజమౌళి ప్లాన్ అదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం భారతీయ సినీ రంగంలో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక దిగ్గజం రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని రూపొందుతున్న ఈ చిత్రం, ప్రకటించినప్పటి నుంచే అంతర్జాతీయ స్థాయిలో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఇదే సమయంలో, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర సమాచారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
వివరాలు
దేవర సెట్‌లో షూట్
సాధారణంగా రాజమౌళి చిత్రాలు అంటే అద్భుతమైన విజువల్స్, అత్యున్నత గ్రాఫిక్స్ అనేవి ప్రత్యేక గుర్తింపుగా ఉంటాయి. ఇదే తరహాలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం కూడా ఆయన ఆధునిక మోషన్ క్యాప్చర్ సాంకేతికతతో పాటు భారీ స్థాయిలో సెట్స్‌ను హైదరాబాద్‌లో సిద్ధం చేయించారు. అయితే, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన 'దేవర' సినిమా కోసం నిర్మించిన విశాలమైన సెట్స్‌ను ఇప్పుడు తన కొత్త సినిమా చిత్రీకరణకు వినియోగిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాలు
అండర్ వాటర్ స్టూడియో సెట్స్..
భారీ వ్యయంతో రూపొందించిన ప్రత్యేక అండర్‌వాటర్ స్టూడియో సెట్స్ రాజమౌళి ఆలోచనలకు అనుకూలంగా ఉండటంతో, అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సాహస సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో, వాటి కోసం ఈ అండర్‌వాటర్ షూట్‌ను ప్రణాళికలో భాగంగా చేర్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే జక్కన్న భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇండస్ట్రీలో చర్చలు సాగుతున్నాయి.