Mahesh Babu: 'ముఫాసా' తెలుగు ట్రైలర్ రీలిజ్.. మహేష్ బాబు వాయిస్‌కు ఫ్యాన్స్ ఫిదా
హాలీవుడ్ నిర్మాణ సంస్థ తాజాగాగా తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో 'ముఫాసా: ది లయన్ కింగ్' ఈ ప్రాజెక్టు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ రిలీజైంది. ఇందులో 'ముఫాసా' పాత్రకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు వాయిస్ అందించారు. ''అప్పుడప్పుడు ఈ చల్లని గాలి.. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే అవి మాయమవుతున్నాయి'' అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్స్ ట్రైలర్‌ను ఆసక్తికరంగా మార్చింది.
డిసెంబర్ 20న సినిమా రిలీజ్
తెలుగులో 'ముఫాసా'కు వాయిస్‌ను అందించడం నాకు చాలా ఆనందంగా ఉందని ఈ పాత్ర ప్రత్యేకంగా అనిపిస్తోందని మహేష్ బాబు పేర్కొన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక, హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ అందించగా, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన తనయుడు అబ్రం వాయిస్ ఓవర్ అందించారు.