
Shilpa shirodkar: కొవిడ్ బారిన పడిన బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్.. సోషల్ మీడియాలో పోస్టు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు కూడా ఈ వైరస్ ప్రభావానికి లోనవుతున్నారు.
ఇప్పటికే ఐపీఎల్ పోటీల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి వెలుగులోకి వచ్చింది.
ఆమె మరెవరో కాదు, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్.
కరోనా వైరస్ తనకు సోకిన విషయాన్ని శిల్పా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
వివరాలు
నమ్రతా స్పందన ఎలా ఉంది?
"ప్రియమైన మిత్రులారా! నాకు కోవిడ్ టెస్టులో పాజిటివ్‌గా తేలింది. మీరు జాగ్రత్తగా ఉండండి. మాస్క్ ధరించడం వంటి ముందు జాగ్రత్తలు తప్పకుండా పాటించండి" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఆమె ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతోంది.
ఈ సమాచారాన్ని తెలుసుకున్న బాలీవుడ్ నటులు, అభిమానులు,నెటిజన్లు శిల్పాకు ధైర్యం చెబుతూ, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
శిల్పాకు కరోనా సోకిన విషయాన్ని తెలుసుకున్న నమ్రతా శిరోద్కర్ తక్షణమే స్పందించారు.
శిల్పా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆమె పోస్ట్‌కు ప్రేమ ఎమోజీలతో సమాధానమిచ్చారు.
నమ్రతాతో పాటు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా,సోనాలి బింద్రే,డయానా పాండే లాంటి పలువురు సినీ ప్రముఖులు శిల్పా ఆరోగ్యంగా తిరిగి కోలుకోవాలని ఆకాంక్షలు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శిల్పా శిరోద్కర్ చేసిన ట్వీట్
Stay Safe ♥️ pic.twitter.com/Hq5aqKjf5Z
— Shilpa shirodkar (@Shilpashirodkr) May 19, 2025