తదుపరి వార్తా కథనం

మరో యాడ్ షూట్ లో మహేష్ బాబు.. అదిరిన కొత్త లుక్
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Sep 26, 2023
09:35 am
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే కొత్త లుక్కుతో అబ్బురపరుస్తున్నారు.ఈ మేరకు ఓ సరికొత్త యాడ్ షూట్ లో ఆయన పాల్గొన్నారు.
తాజా యాడ్ షూట్ కి సంబంధించి కొన్ని ఫోటోలను, మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ షేర్ చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
తాజా ఫొటోలో మహేష్ లుక్ సూపర్బ్ అని ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు.ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైయిల్ నిపుణులు అలీమ్ హకీమ్ మహేష్ కు నయా లుక్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే నెటిజన్లు హాలీవుడ్ హీరోలా ఉన్నారంటూ ప్రశంసిస్తున్నారు.
మహేష్ బాబుకు యాడ్స్ ఎక్కువగా చేస్తారన్నపేరుంది.మరోవైపు ప్రేక్షకులు, మహేష్ అభిమానులు, గుంటూరు కారంకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అనంతరం రాజమౌళి చిత్రం కోసం ఉత్కంఠతో ఉన్నారు.