తదుపరి వార్తా కథనం
    
    
                                                                                మహేష్ బాబు జిమ్ వర్కౌట్స్: అభిమానులతో అద్భుతమైన కొటేషన్ ని పంచుకున్న సూపర్ స్టార్
                వ్రాసిన వారు
                Sriram Pranateja
            
            
                            
                                    Aug 17, 2023 
                    
                     10:30 am
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు అప్పుడప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా చేతులకు సంబంధించిన వర్కౌట్లు చేస్తూ మహేష్ బాబు కనిపించారు. ఈ ఫోటోను ఇన్స్ టాలో పంచుకున్న మహేష్ బాబు, నొప్పిని కౌగిలించుకుంటేనే శరీరానికి లాభమనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు కొటేషన్, జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మహేష్ బాబు ప్రస్తుతం, త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ సినిమా నుండి మరికొద్ది రోజుల్లో మొదటి పాట రిలీజ్ అవుతుందని సమాచారం.