Pushpa 3: 'పుష్ప 3'పై మేకర్స్ కీలక అప్‌డేట్!
అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం "పుష్ప 2: ది రూల్" సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లతో దేశవ్యాప్తంగా సత్తా చాటింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఫాస్టెస్ట్ రికార్డులు సెట్ చేస్తూ, ఈ చిత్రం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఇప్పటికే మేకర్స్ 'పుష్ప 3: ది ర్యాంపేజ్'పై అధికారిక ప్రకటన చేశారు. తాజాగా ఈ సీక్వెల్ షూటింగ్ రెండేళ్ల తర్వాత ప్రారంభం కానుందని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు వెల్లడించారు.
త్వరలో మరిన్ని అప్‌డేట్స్
మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా సెట్స్ పైకి తీసుకురానున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ ఇప్పటినుంచే 'పుష్ప 3' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్‌పై మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి.