
Malayalam actor: కేరళ యువ రాజకీయ నాయకుడిపై మలయాళ నటి ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ కాంగ్రెస్‌లో కలకలం రేగింది. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు రాహుల్ మామ్‌కూటత్తిల్, ఓ నటి ఆరోపణల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. రాహుల్ పాలక్కడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆదూర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ,తన రాజీనామాను అధికారికంగా ప్రకటించారు. ఆయన తనపై ఎదురైన ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. ఒక ప్రముఖ పార్టీకి చెందిన యువనేత తనపై అనుచితంగా వ్యవహరిస్తున్నాడని, మూడు సంవత్సరాలుగా వేధిస్తున్నాడని, రీని జార్జ్ అనే నటి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సమస్యను పలు సార్లు పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకెళ్లినా, ఎటువంటి పరిష్కారం రావడంలేదని ఆమె వాపోయారు.
వివరాలు
నన్ను ఎవరు రాజీనామా చేయమని డిమాండ్ చేయలేదు: రాహుల్
రీని జార్జ్ నేరుగా రాహుల్ పేరును ప్రస్తావించకపోయినా, బీజేపీ,సీపీఎం శ్రేణులు ఈ ఘటనలో ఆయన ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నాయి. రాజీనామా చేయాలని నిరసనలు చేపడుతున్నాయి. కాంగ్రెస్‌లోని సీనియర్ నేత వీడీ సతీశన్ ప్రకారం, ఈ వ్యవహారంపై పార్టీలో అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలిపారు. దోషులు తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో,యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ మామ్‌కూటత్తిల్ రాజీనామా ప్రకటించారు. తనా పై వచ్చిన ఆరోపణల విషయంలో పార్టీ పెద్దలతో చర్చించానని, ఎవరూ ఆయనను రాజీనామా చేయమని డిమాండ్ చేయలేదని రాహుల్ తెలిపారు. ఆ నటి నా స్నేహితురాలు. ఆమె ఆరోపణలు చేసిన వ్యక్తి నేను కాదని నమ్ముతున్నాను. నేను ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడలేదు'' అని పేర్కొన్నారు