Page Loader
Manchu Manoj: 'గజపతి' లుక్ లో మంచు మనోజ్.. ఫస్ట్ లుక్ ఫోటో వైరల్! 
'గజపతి' లుక్ లో మంచు మనోజ్.. ఫస్ట్ లుక్ ఫోటో వైరల్!

Manchu Manoj: 'గజపతి' లుక్ లో మంచు మనోజ్.. ఫస్ట్ లుక్ ఫోటో వైరల్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2024
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఉగ్రం' ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న మల్టీ స్టారర్‌ చిత్రం 'భైరవం'. టాలీవుడ్‌ హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లకొండ సాయిశ్రీనివాస్‌లు ఇందులో నటిస్తున్నారు. ముగ్గురు హీరోలతో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై జయంతిలాల్ గడ సమర్పణలో కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. తాజాగా మంచు మనోజ్ పోస్టర్‌ను కూడా చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో మనోజ్, గజపతి పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.

Details

పవర్‌ఫుల్‌ లుక్‌లో మంచు మనోజ్

ఈ పోస్టర్‌లో మనోజ్ వర్షంలో తడుస్తూ పవర్‌ఫుల్‌ లుక్‌తో మనోజ్ ఆకట్టుకున్నాడు. వర్షంలో కారు, గొడుగులు పట్టుకున్న ప్రజల మధ్య ఆవేశంతో కనిపిస్తున్న ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తుండగా, ఇక నారా రోహిత్ వరద పాత్రలో కనిపించనున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్