Manchu Manoj :'ఉస్తాద్' షోలో నాని,మనోజ్ రచ్చ,తొలి ఎపిసోడ్‌లో శ్రీప్రియతో కలిసి సందడి
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ సరికొత్త గేమ్ షో 'ఉస్తాద్' ర్యాంప్ ఆడిద్దాం గేమ్ షో డిసెంబర్ 15న అలరించేందుకు రంగం సిద్ధమైంది. మనోజ్ హోస్ట్'గా 'ఉస్తాద్' పేరుతో సెలబ్రిటీ గేమ్ షో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈనెల 15 నుంచి ఈటీవీ విన్ ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తొలి ఎపిసోడ్'కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.ఫస్ట్ ఎపిసోడ్'లో నాని పాల్గొన్నారు. మనోజ్'తో కలిసి ఆయన కలిసి చేసిన అల్లరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రోమోలో నాని,శ్రీప్రియ కలిసి గేమ్ ఆడుతున్న సన్నివేశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.ఇంతకీ ఆమె గేమ్ ఆడి ఎంత అమౌంట్ తీసుకెళ్లింది అన్న విషయం డిసెంబర్ 15న తెలియనుంది. ఒక్కో ఎపిసోడ్'కి రూ.50 లక్షల ప్రైజ్'మనీ ఉంటుందన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉస్తాద్ ప్రోమో రిలీజ్
Ustaad Promo Released#Ustaad #Manchumanoj #Nani #Trolls #Evtwin #memes #Shorts #Reels #YouTube pic.twitter.com/jYg6mo34j9
— Cringe Mafia (@MafiaCring82337) December 12, 2023