Page Loader
Kanappa: 'నాకెందుకు ఈ పరీక్ష స్వామీ'.. 'కన్నప్ప' హార్డ్‌డ్రైవ్‌ బయటకు వెళ్లడంపై.. మంచు విష్ణు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ 
'కన్నప్ప' హార్డ్‌డ్రైవ్‌ బయటకు వెళ్లడంపై.. మంచు విష్ణు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌

Kanappa: 'నాకెందుకు ఈ పరీక్ష స్వామీ'.. 'కన్నప్ప' హార్డ్‌డ్రైవ్‌ బయటకు వెళ్లడంపై.. మంచు విష్ణు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కన్నప్ప' ఇప్పటికే షూటింగ్‌ను పూర్తిచేసుకొని, జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో, ఈ సినిమాను మరో వివాదం చుట్టుముట్టింది. ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన దృశ్యాలు ఉన్న హార్డ్‌డ్రైవ్‌ అనుమతి లేకుండా బయటకు తరలించబడిన ఘటన టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై చిత్ర యూనిట్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న మంచు విష్ణుకు ఈ సంఘటన కొత్త తలనొప్పిగా మారింది.

వివరాలు 

#హరహరమహదేవ్ హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌లో పోస్ట్

దీనిపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఆవేదన వ్యక్తం చేశారు. "జటాజూటధారి స్వామీ, నీ కోసం తపస్సు చేస్తున్న నాకెందుకు ఈ పరీక్షలు?" అంటూ #హరహరమహదేవ్ హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టును చూసిన విష్ణు అభిమానులు అతడికి ధైర్యం చెబుతూ, మద్దతు తెలుపుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మంచు విష్ణు చేసిన ట్వీట్ 

వివరాలు 

అసలు విషయం ఏమిటంటే… 

హైదరాబాద్‌కు చెందిన కోకాపేట ప్రాంతంలో నివసించే రెడ్డి విజయ్‌కుమార్ అనే వ్యక్తి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. 'కన్నప్ప' సినిమాలోని ముఖ్యమైన కంటెంట్‌ను కలిగి ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను ముంబయిలో ఉన్న హెచ్‌ఐవీఈ స్టూడియోస్‌ వారు డీటీడీసీ కొరియర్‌ ద్వారా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న విజయ్‌కుమార్ కార్యాలయానికి పంపారు. ఈ పార్సిల్‌ను ఈ నెల 25వ తేదీన ఆఫీస్ బాయ్ అయిన రఘు తీసుకున్నాడు.కానీ,అతను ఎవరికీ చెప్పకుండా ఆ హార్డ్‌డ్రైవ్‌ను చరిత అనే మహిళకు అప్పగించాడు. అప్పటి నుండి వీరిద్దరూ కనపడకుండా పోయారు. తమ ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే దురుద్దేశంతో ఈ పని చేసినట్లు, విజయ్‌కుమార్ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వివరాలు 

ఘటనపై కేసు నమోదు

ఫిర్యాదులో ఆ హార్డ్‌డిస్క్‌లో సుమారు 1.30 గంటల నిడివి గల సినిమాకీ సంబంధించి కీలకమైన కంటెంట్ ఉందని పేర్కొన్నారు. పోలీసుల ప్రకారం, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హార్డ్‌డ్రైవ్‌లో ప్రభాస్‌ నటించిన ముఖ్యమైన యాక్షన్ సీన్ ఉందనే వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు.