Robinhood : మార్చి 28 బాక్సాఫీస్ సమరం.. 'రాబిన్‌హుడ్', 'మ్యాడ్ స్క్వేర్' రిలీజ్‌కి రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాబిన్‌హుడ్' (Robinhood). 'భీష్మ' తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మార్చి 28, 2025న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నితిన్ రాబిన్‌హుడ్ అనే దొంగ పాత్రలో కనిపించనున్నాడు.
శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అదే రోజున మరో క్రేజీ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' (MAD Square) కూడా విడుదల కానుంది.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వస్తున్న ఈ చిత్రం 'MAD' సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది.
Details
రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.
'రాబిన్‌హుడ్' యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుండగా, 'మ్యాడ్ స్క్వేర్' యూత్‌ను ఆకట్టుకునే కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జానర్ పరంగా భిన్నంగా ఉన్నా ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.