గుంటూరు కారం సినిమాలో హిట్ హీరోయిన్: నో లీక్స్ అంటూ లీక్ చేసిన మీనాక్షి చౌదరి
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తున్న గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే స్థానంలో ఎవరు రానున్నారనేది ఆసక్తిగా మారింది.
గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల ప్రకారం, శ్రీలీల మెయిన్ ఫిమేల్ లీడ్ గా కనిపిస్తుందని, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు సమాచారం.
ఇచ్చట వాహనాలు నిలుపరాదు, హిట్ 2, ఖిలాడి సినిమాల్లో నటించిన మీనాక్షి చౌదరి గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.
Details
మహేష్ బాబుకు అభిమాని
తాజాగా విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న హత్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన మీనాక్షి చౌదరిని గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడాలని మీడియా కోరింది.
ప్రస్తుతానికి నో లీక్స్ అని చెప్పుకొచ్చిన మీనాక్షి, ఆ తర్వాత గుంటూరు కారం సినిమాలో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని, తాను మహేష్ బాబుకు పెద్ద అభిమానినని, గుంటూరు కారం మొదటి షాట్ లో మహేష్ బాబు తో నటించానని చెప్పుకొచ్చింది.
అతడు, ఖలేజా సినిమాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న మూడవ చిత్రమిది. గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేష్ బాబు ఊర మాస్ గా కనిపించనున్నారు.