
Vishwak Sen: 'ఈ నగరానికి ఏమైంది' పార్ట్ 2లో మెగా ట్విస్ట్.. బాలయ్య గెస్ట్ అప్పీరెన్స్?
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఈ నగరానికి ఏమైంది' 2018లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తరుణ్ బాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు నిర్మించారు. ఇందులో సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకమాను, అనిషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ హిట్ సినిమాకు సీక్వెల్ రూపొందించబోతుండగా, ఇటీవల చిత్రబృందం అధికారికంగా టైటిల్‌ను ప్రకటించింది. 'ఈఎన్ఈ రిపీట్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ, వీడియో రూపంలో విడుదల చేశారు. ఇందులో టీమ్ కన్యా రాశి వచ్చేసింది అనే క్యాప్షన్‌ను జోడించి, సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచారు.
Details
15 నిమిషాలు పాటు కనిపించే అవకాశం
ఇక ఈ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరగుతోంది. 2025లో ఈ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వైరలవుతున్నాయి. సుమారు 15 నిమిషాల పాటు బాలయ్య స్క్రీన్‌పై కనిపించనున్నారని, ఆ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది. అలానే మరో రెండు టాలీవుడ్ హీరోయిన్స్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్ పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమాచారం నిజమో కాదో ఇంకా స్పష్టత రాలేదు. చిత్రబృందం కూడా ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ, బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ విషయమై వస్తున్న రూమర్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి.