Chiranjeevi: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' పై మెగాస్టార్ స్పెషల్ ట్వీట్
ఈ వార్తాకథనం ఏంటి
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబోలో తెరకెక్కిన 'మిస్ శెట్టి మిస్టర్ శెట్టి' చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందు రానుంది.
తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే.. మూవీ ఫస్ట్ రివ్యూను మెగాస్టార్ చిరంజీవి ఇచ్చేశారు.
ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు. తర్వాత ఈ చిత్రంపై తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను చూశానని, ఈ మూవీ మొదటి నుంచి చివరి వరకూ ఎంతగానో ఆకట్టుకుందని, కడపుబ్బా నవ్వించే వినోదభరిత చిత్రమని, ప్రస్తుత యూత్ కోసం సరికొత్తగా ఈ మూవీని తెరకెక్కించారని చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.
Details
అనుష్క, నవీన్ పోలిశెట్టి సినిమాకు ప్రాణం పోశారని మెగాస్టార్ కితాబు
ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు ఎమోషన్స్ కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపొందించిన డైరక్టర్ మహేష్ బాబును అభినందించాల్సిందేనని, ఈ సినిమా వందశాతం ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో ఎలాంటి సందేహం లేదని చిరంజీవి చెప్పుకొచ్చారు.
కొంచె గ్యాప్ తీసుకున్న అనుష్క మరింత అందంగా ఈ సినిమాలో కనిపించిందని, నవీన్, అనుష్కలు ఈ సినిమాకు ప్రాణం పోశారని వెల్లడించారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిరంజీవి చేసిన ట్వీట్
'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, 'జాతి రత్నాలు' కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్… pic.twitter.com/ADJVt6ins6
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 5, 2023