Page Loader
Viral video: మోహన్‌లాల్‌ను ఆటపట్టించిన మమ్ముట్టి,జయరామ్ 
Viral video: మోహన్‌లాల్‌ను ఆటపట్టించిన మమ్ముట్టి,జయరామ్

Viral video: మోహన్‌లాల్‌ను ఆటపట్టించిన మమ్ముట్టి,జయరామ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2024
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాలీవుడ్ దిగ్గజాలైన మమ్ముట్టి,మోహన్‌లాల్,జయరామ్‌లతో కూడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మెగాస్టార్ మమ్ముట్టి,నటుడు జయరామ్‌తో కలిసి పాత పాటకు డ్యాన్స్ చేసి ప్రేక్షకుల మనస్సులు దోచేస్తున్నారు. ఈ వీడియోలో వారు మరో మలయాళ దిగ్గజం మోహన్‌లాల్‌ను ఆటపట్టించడం కనిపించింది. మమ్ముట్టి, జయరామ్‌లు మోహన్‌లాల్‌ను తమతో బాటు డాన్స్ చెయ్యడానికి పిలిచారు. అయితే మోహన్‌లాల్ వారి డాన్స్ చూస్తూ సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోతే మమ్ముట్టి,జయరామ్ కలిసి అబ్రహం ఓజ్లర్ చిత్రంలో కనిపించారు.ఇది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇటీవల మోహన్‌లాల్ నటించిన మలైకోట్టై వాలిబన్ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..