LOADING...
Mammootty: మమ్ముట్టి ఆరోగ్యంపై క్లారిటీ.. మోహన్‌లాల్‌ షేర్ చేసిన క్యూట్ ఫొటో
మమ్ముట్టి ఆరోగ్యంపై క్లారిటీ.. మోహన్‌లాల్‌ షేర్ చేసిన క్యూట్ ఫొటో

Mammootty: మమ్ముట్టి ఆరోగ్యంపై క్లారిటీ.. మోహన్‌లాల్‌ షేర్ చేసిన క్యూట్ ఫొటో

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సినీ పరిశ్రమలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌ స్నేహం ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఎప్పుడైనా వీరి పేర్లు వినిపిస్తే, నిజమైన స్నేహం అంటే ఏమిటో గుర్తుచేసే జంటగా వీరిని చెప్పుకుంటారు. అలాంటి మిత్రుడిపై తనకున్న ఆప్యాయతను మోహన్‌లాల్‌ మరోసారి బహిర్గతం చేశారు. ఇటీవల మమ్ముట్టి ఆరోగ్యంపై అనేక రకాల వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కొంతకాలం విశ్రాంతి తీసుకున్న ఆయన ఇప్పుడు కోలుకున్నారని, త్వరలోనే మళ్లీ షూటింగ్‌ లొకేషన్‌లో కనిపించనున్నారని మలయాళ మీడియా నివేదికలు వెల్లడించాయి.

వివరాలు 

నిజమైన ఆత్మీయ బంధాన్ని మరోసారి గుర్తు చేసిన మోహన్ లాల్  

ఇదే విషయాన్ని మోహన్‌లాల్‌ పరోక్షంగా తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో ఒక అందమైన ఫొటోను షేర్‌ చేసి తెలిపారు . ఆ ఫొటోకు ప్రేమను, ఆనందాన్ని వ్యక్తం చేసేలా ఎమోజీలను జోడించారు. ఆ క్యూట్‌ ఫొటో చూసిన నెటిజన్లు ఇద్దరి మధ్య ఉన్న నిజమైన ఆత్మీయ బంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. మమ్ముట్టి అనారోగ్య వార్తలు వచ్చినప్పుడు మోహన్‌లాల్‌ శబరిమల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థించిన విషయం తెలిసిందే. అప్పుడు అభిమానులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఇలాంటి సమస్యలు ఎప్పుడూ ఎవరికైనా వస్తాయని ధైర్యం చెప్పిన సందర్భం గుర్తుకొస్తోంది. ఇక నిర్మాతలతో పాటు సినీ వర్గాల వారు కూడా మమ్ముట్టి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టతనిచ్చారు.

వివరాలు 

క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు మమ్ముట్టి

ఆయనకు దగ్గరగా పనిచేసే మేకప్‌ ఆర్టిస్ట్‌ జార్జ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ''మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. ఆయన కోలుకోవడం నాకు చెప్పలేనంత ఆనందం ఇచ్చింది. ఎప్పుడూ ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు'' అని తెలిపారు. అలాగే నటి మంజు వారియర్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మమ్ముట్టితో ఉన్న ఒక ఫొటోను పోస్ట్‌ చేసి, ''వెల్‌కమ్‌ బ్యాక్‌ టైగర్‌'' అనే క్యాప్షన్‌ ఇచ్చారు. దీనిపై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ, ''లెజెండ్స్‌ ఎప్పటికీ అలసిపోరు'' అంటూ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం మమ్ముట్టి నటిస్తున్న తాజా చిత్రం కళంకావల్. జితిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న మోహన్ లాల్ చేసిన ఫోటో ఇదే..