Page Loader
Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్
భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్

Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
09:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సినీ దిగ్గజం మోహన్‌లాల్ బుధవారం తన 65వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'వృషభ' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో మోహన్‌లాల్ ఒక ధీరవీరుడి పాత్రలో కనిపిస్తూ, అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో మోహన్‌లాల్ శరీరాన్ని కప్పేలా డిజైన్ చేసిన డ్రాగన్ పొలుసుల ఆకారంలో బంగారు-గోధుమ కలర్ కవచం ధరించి కనిపించారు. పొడవాటి జుట్టు,భారీ గడ్డం,నుదుటిపై తెల్లటి తిలకం వంటి డిటైల్స్‌తో ఆయన లుక్ ప్రాచీన యోధుడిలా మెరిసిపోయింది. సంప్రదాయ ఆభరణాలు, ముక్కుపుడకతో ఆయన వేషధారణలో ఒక రౌద్రత ఉండటమే కాకుండా, రాజసమైన గంభీరతను కూడా ప్రతిబింబించింది.

వివరాలు 

అభిమానుల ప్రేమే తనకు అండగా..

ఈ ఫస్ట్ లుక్‌ను మోహన్‌లాల్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకున్నారు. "ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. ఈ లుక్‌ను నా అభిమానులందరికీ అంకితంగా విడుదల చేస్తున్నాను. నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. తుపాను మేల్కొంది. గర్వంగా, శక్తివంతంగా 'వృషభ' ఫస్ట్ లుక్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది మీ మనసులను కదిలించే కథగా నిలుస్తుంది" అని పోస్ట్‌లో పేర్కొన్నారు. తన పుట్టినరోజున ఈ లుక్ విడుదల కావడం తనకు మితిమీరిన ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. అభిమానుల ప్రేమే తనకు అండగా ఉంటుందని ఆయన హృదయపూర్వకంగా తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోహన్ లాల్ చేసిన ట్వీట్ 

వివరాలు 

2025 అక్టోబర్ 16న విడుదల 

ఈ చిత్రం నంద కిశోర్ దర్శకత్వంలో రూపొందుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహీ పరేఖ్ మెహతా వంటి ప్రముఖులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ 'వృషభ' చిత్రాన్ని 2025 అక్టోబర్ 16న తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.