Page Loader
Diwali release: దీపావళికి థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే.. 
Diwali release: దీపావళికి థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

Diwali release: దీపావళికి థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే.. 

వ్రాసిన వారు Stalin
Nov 06, 2023
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి పండగ‌కు పలు సినిమాలు థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. దసరాకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, దీపావళికి మాత్రం డబ్బింగ్‌ చిత్రాలు సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలవుతున్న సినిమాల గురించి తెలుసుకుందాం. 'జపాన్‌' హీరో కార్తి-రాజు మురుగన్‌ దర్శకత్వంలో రూపొంచిన చిత్రం 'జపాన్‌'. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబరు 10న థియేటర్లలో విడుదలవుతోంది. ఇందులో అనుఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. ఈ సినిమాలో దొంగ పాత్రలో కార్తి నటించాడు. 'జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌' కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రల్లో నటించిన సినిమా 'జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌'. నవంబర్ 10న విడుదల కానుంది.

సినిమా

సల్మాన్ ఖాన్ మూవీ 'టైగర్‌3' 

మనీష్‌ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన మూవీ 'టైగర్‌3'. ' టైగర్‌ జిందా హై'కు ఈ సినిమాను సీక్వెల్‌గా తీసారు. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ మూవీలో కత్రినా కైఫ్‌ నటించింది. ఈ మూవీ నవంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. 'అలా నిన్ను చేరి' దినేశ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'అలా నిన్ను చేరి'. ఇది నవంబర్ 10న విడుదలవుతోంది. 'ది మార్వెల్స్‌' అమెరికన్‌ సూపర్‌ హీరో మూవీ 'ది మార్వెల్స్‌' నవంబరు 10న రిలీజ్ అవుతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదలవుతోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన 'దీపావళి' మూవీ నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒటీటీ

ఓటీటీలో విడులయ్యేవి ఇవే..

అమెజాన్‌ ప్రైమ్‌ రెయిన్‌ బో రిష్టా - నవంబర్‌ 7 బీటీఎస్‌: ఎట్‌ టూ కమ్‌ - నవంబర్‌ 9 పిప్పా- నవంబర్‌ 10 007: రోడ్‌ టు ఎ మిలియన్‌- నవంబర్‌ 10 దీనా హశేం: డార్క్‌ లిటిల్‌ విస్పర్స్‌(షో) - నవంబర్‌ 10 హాట్‌స్టార్‌లో రిలీజ్‌లు ది శాంటాక్లాజ్స్‌-నవంబర్‌ 8 విజిలాంటి -నవంబర్‌ 8 లేబుల్‌ (తెలుగు)- నవంబర్‌ 10 నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌లు రిక్‌ అండ్‌ మార్టీ సీజన్‌ 7-నవంబర్‌ 6 ఎస్కేపింగ్‌ ట్విన్‌ ఫ్లేమ్స్‌-నవంబర్‌ 8 సైబర్‌ బంకర్‌: ద క్రిమినల్‌ అండర్‌వరల్డ్‌ - నవంబర్‌ 8 రాబీ విలియమ్స్‌- నవంబర్‌ 8 ద క్లాస్‌ ఫ్యామిలీ 3 - నవంబర్‌ 8