Surya: మన దేశంలో 'కంగువా' లాంటి సినిమాలు రావాలి.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రయోగాత్మక చిత్రాలను చేయడంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముందంజలో ఉంటాడు.
ఆయన నటించిన తాజా చిత్రం 'కంగువ' ప్రయోగత్మాకంగా రూపొందిస్తున్నారు. సూర్య 42వ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు.
కంగువ సినిమా నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ , సూర్య టీం ప్రమోషన్స్‌లో మునిగిపోయింది.
ప్రమోషన్స్‌లో భాగంగా సూర్య సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు.
ఉత్తమమైన సినిమాలు అందించడానికి గజినీ, సింగం, 24, జై భీమ్ వంటి చిత్రాల నుంచి ప్రేరణ పొందుతూ, తాము ముందుకెళ్తుతున్నామని చెప్పారు.
Details
ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానున్న కంగువా
కంగువ వంటి చిత్రం మన దేశంలో ఇప్పటివరకు అందరికీ తెలియదన్నారు.
'300', 'బ్రేవ్ హర్ట్' వంటి సినిమాలను చూసి వాటిని అద్భుతంగా భావిస్తామన్నారు. అయితే, భారతీయ సినిమాలు కూడా అలా ఉండాలని తన ఆకాంక్ష అని చెప్పారు.
తమ దర్శకుడు శివ విజువల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. 170 రోజుల షూటింగ్ తర్వాత, కంపర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ చిత్రం తీశామన్నారు.
'కంగువ' స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సమకూర్చారు. 'కంగువ' ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.