Page Loader
Mrunal Thakur: త్వరలో మృణాల్ ఠాకూర్ పెళ్లి.. స్పందించిన స్టార్ బ్యూటీ..?
త్వరలో మృణాల్ ఠాకూర్ పెళ్లి.. స్పందించిన స్టార్ బ్యూటీ..?

Mrunal Thakur: త్వరలో మృణాల్ ఠాకూర్ పెళ్లి.. స్పందించిన స్టార్ బ్యూటీ..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2023
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్(Mrinal Thakur) తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇక హాయ్ నాన్న సినిమాలో నానికి జోడిగా నటించి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మృణాల్ కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తోంది ఇదిలా ఉండగా.. తాజాగా మృణాల్ ఠాకూర్ కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలో ఆమె పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చింది.

Details

దగ్గర్లోనే పెళ్లి చేసుకుంటా : మృణాల్ ఠాకూర్

విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ న్యూ జెర్సీలో ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ హాయ్ నాన్న సినిమా తనకెంతో ప్రత్యేకమైందన్నారు. ఈ సినిమాలో సమయమా, అమ్మడి సాంగ్స్ తనకెంతో ఇష్టమని, సీతారామం సినిమా నుంచి ప్రేక్షకులు తనని అదరిస్తున్నారని పేర్కొంది. ఇక పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించినప్పుడు గట్టి నవ్వి.. త్వరలోనే చేసుకుంటానని తెలిపింది.