Page Loader
Jai Hanuman: 'జై హనుమాన్‌' సినిమా నుండి అప్‌డేట్.. . ఫస్ట్‌లుక్‌ ఎప్పుడంటే? 
'జై హనుమాన్‌' సినిమా నుండి అప్‌డేట్.. . ఫస్ట్‌లుక్‌ ఎప్పుడంటే?

Jai Hanuman: 'జై హనుమాన్‌' సినిమా నుండి అప్‌డేట్.. . ఫస్ట్‌లుక్‌ ఎప్పుడంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2024
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందించిన హను-మాన్ చిత్రం, సూపర్‌ హీరో కథను ఇతిహాసంతో ముడిపెట్టి ప్రేక్షకుల మన్ననలు పొందింది. 2024 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయానికి కొనసాగింపుగా,రానున్న 'జై హనుమాన్' (Jai Hanuman)లో 'శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి?' అనే ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. తాజాగా, 'జై హనుమాన్‌' ఫస్ట్‌లుక్‌ను అక్టోబరు 30న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించారు.

వివరాలు 

ఆంజనేయ స్వామి పాత్రలో స్టార్‌ హీరో

ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్ (PVCU)లో భాగంగా రూపొందుతున్న 'జై హనుమాన్' చిత్రంలో హనుమంతుడి పాత్రలో ఎవరిని చూపిస్తారు? అన్న ఆసక్తి ప్రస్తుతం అందరిలోనూ పెరిగింది. 'కాంతార' ఫేమ్ రిషభ్‌ శెట్టి సహా పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఫస్ట్‌లుక్‌ విడుదల తేదీని ప్రకటించడం ద్వారా చిత్ర బృందం ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచింది. 'హను-మాన్' చిత్రానికి మించి వంద రెట్లు భారీగా ఉంటుందని 'జై హనుమాన్' సినిమా, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఈ సీక్వెల్‌లో, హీరో తేజ సజ్జా హనుమంతు పాత్రలో కనిపిస్తాడని, కానీ ఈ సినిమా హీరో ఆంజనేయ స్వామి అని, ఈ పాత్రను స్టార్‌ హీరో పోషిస్తాడని తెలిపారు.

వివరాలు 

నందమూరి మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా 

మరోవైపు, 'అధీర', 'మహాకాళి' వంటి చిత్రాలు కూడా ప్రశాంత్‌ వర్మ తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో విడుదల కానున్నాయి. అదేవిధంగా, నందమూరి నట వారసుడు, బాలకృష్ణ త‌నయుడు మోక్షజ్ఞను పరిచయ చిత్రానికీ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్