Ilaiyaraaja: ప్రధాని మోదీని కలిసిన సంగీత దర్శకుడు ఇళయరాజా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
''మోదీజీతో ఈ సమావేశం నాకు చిరస్మరణీయమైనది. నా 'సింఫొనీ -వాలియంట్' సహా పలు అంశాల గురించి చర్చించాం. ఆయన ప్రశంసలు, ప్రోత్సాహానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు'' అని పేర్కొన్నారు.
ఇటీవల లండన్‌లో ఇళయరాజా 'వాలియంట్' పేరుతో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు.
వెస్ట్రన్ క్లాసికల్ సింఫొనీని ప్రదర్శించిన తొలి ఆసియా సంగీత దర్శకుడిగా ఆయన అరుదైన రికార్డు నెలకొల్పారు.
కొద్ది రోజుల క్రితం చెన్నై చేరుకున్న ఇళయరాజా, సంగీతానికి వయసుతో ఎలాంటి సంబంధం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్తులో 13 దేశాల్లో 'వాలియంట్' సంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇళయరాజా చేసిన ట్వీట్
A memorable meeting with Hon’ble PM Shri @narendramodi ji We spoke about many things, including my Symphony “Valiant”. Humbled by his appreciation and support. 🙏 @OneMercuri pic.twitter.com/caiP770y13
— Ilaiyaraaja (@ilaiyaraaja) March 18, 2025