
Manchu Manoj: మా నాన్న దేవుడు.. కన్నీరు పెట్టుకున్న మంచు మనోజ్
ఈ వార్తాకథనం ఏంటి
తన తండ్రి మోహన్‌బాబు, అన్న మంచు విష్ణు తరుపున మీడియా మిత్రులకు క్షమాపణలు తెలిపినట్లు నటుడు మంచు మనోజ్ వెల్లడించారు.
ఇలాంటి రోజు వస్తుందని తాను ఊహించలేదని అన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడూ మద్దతుగా ఉంటానని చెప్పారు.
హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టారు.
మంచు మనోజ్ తమ కుటుంబ సభ్యులు ఎలాంటి సాయం కోరలేదని, వారి ఆదాయంపై ఆధారపడలేదని చెప్పారు.
తన భార్య, తన కుమార్తెను ఈ వివాదంలోకి లాగడం మంచిది కాదన్నారు.
Details
విచారణకు హాజరవుతా : మనోజ్
తమ కుటుంబంలో ఎవరి ఆదాయం మీదనూ ఆధారపడలేదని తాను సొంత కాళ్లపై పనిచేసుకుంటున్నానని తెలిపారు.
తన నాన్నతో ఆస్తి విషయాలపై గొడవ పడడం వాస్తవం కాదని తెలిపారు. మా నాన్న దేవుడు అని, కానీ ఈరోజు చూస్తున్నది తన నాన్నను కాదన్నారు.
తనకు సంబంధించి ఎవరిపై దాడి జరిగిందో, సీసీ కెమెరాల్లో చూపించాలని, తాను పోలీసుల విచారణకు హాజరవుతానని, ఆ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.