LOADING...
Naga Chaitanya Engagement: ఇవాళ హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్..?
ఇవాళ హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్..?

Naga Chaitanya Engagement: ఇవాళ హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2024
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని నట వారసుడిగా, నాగార్జున కుమారుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి హీరో నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చాడు. ఏమాయ చేశావే సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇక ఆ మూవీలో హీరోయిన్‌గా నటించిన సమంతను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అయితే పెళ్లయిన నాలుగేళ్లకు విడాకులు తీసుకుంటున్నట్లు సమంత, నాగ చైతన్య ప్రకటించి అప్పట్లో పెద్ద షాక్ ఇచ్చారు. గతంలో హీరోయిన్ శోభితా ధూళిపాళతో నాగ చైతన్య లవ్‌లో ఉన్నట్లు ఎన్నో కథనాలొచ్చాయి. తాజాగా వీరిద్దరూ ఇవాళ నిశ్చితార్థ: చేసుకోనున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కొద్దిమంది బంధువుల సమక్షంలోనే వీరి ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది.

Details

సోషల్ మీడియాలో నాగార్జున్ అధికారికంగా ప్రకటించే అవకాశం

అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో అధికారికంగా నాగార్జున ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. శోభితా ధూళిపాళ గూఢచారి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. కాగా స్టార్ హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్న నాగ చైతన్య 2021లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.