Thandel: నాగచైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్.. 'తండేల్' రెండు రోజుల కలెక్షన్లు ఏంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టుతోంది.
ఫస్ట్ డేకి ధీటుగా రెండో రోజూ మంచి కలెక్షన్లు నమోదయ్యాయి.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు రూ. 21.27 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఇక రెండో రోజు కూడా దాదాపు రూ. 20 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.
Details
రూ.41.20 కోట్లు వసూలు
దీంతో రెండు రోజులు కలిపి 'తండేల్' ప్రపంచవ్యాప్తంగా రూ. 41.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు పెరగడం విశేషం.
సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం, వీకెండ్ కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ఆదివారం అడ్వాన్స్ బుకింగ్ రెండో రోజుకంటే ఎక్కువగా ఉండటంతో మూడో రోజు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక రెండో రోజుకే రూ. 41 కోట్లకు పైగా గ్రాస్ వసూలు కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఎందుకంటే ఇది నాగచైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లను రాబట్టిన చిత్రం కావడం విశేషం.