Thandel OTT release: నాగచైతన్య 'తండేల్' ఓటీటీలో సందడి
ఈ వార్తాకథనం ఏంటి
నాగ చైతన్య హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'తండేల్' (Thandel) ఇటీవల భారీ విజయాన్ని సాధించింది.
ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుల కథ ఆధారంగా రూపొందించారు.
వేటకు వెళ్లిన ఈ మత్స్యకారులు పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి, అక్కడ రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన నిజ జీవిత ఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు.
చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించారు.
Details
మార్చి 7న స్ట్రీమింగ్
ఫిబ్రవరి 7న విడుదలైన 'తండేల్' బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికపై విడుదలకు సిద్ధమైంది.
మార్చి 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ 'ఎక్స్' వేదికగా అధికారికంగా ప్రకటించింది.