Naga Shaurya: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నాగ శౌర్య ప్లాప్ సినిమా
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. ఎలాంటి ప్రచారం లేకుండానే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకుల్లో పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. చాలామందికి ఈ సినిమా విడుదలైన విషయమే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు హంగామా లేకుండానే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా, నేటి నుంచే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకువచ్చారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
వివరాలు
బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం..
ఈ సినిమాకు కొత్త దర్శకుడు రమేష్ దేసిన దర్శకత్వం వహించారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలను ఆకట్టుకునేలా తెరకెక్కించినప్పటికీ, కథ, కథనం మాత్రం పాత తరహాలో సాగడం ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్‌కుమార్, సముద్రఖని వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించగా, విధి యాదవ్ హీరోయిన్‌గా నటించింది. హరీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు.