Dhanush : 'కుబేర' వస్తున్నాడు.. ధనుష్, నాగార్జున మాస్ ఎంటర్‌టైనర్‌కు విడుదల తేదీ ఖరారు!
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ హీరోగా, ప్రతిష్టాత్మక దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా 'కుబేర'.
ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల అంటేనే కథ, కథనానికి గొప్ప ప్రాధాన్యం ఉంటుందని సినీ ప్రేమికులకు తెలిసిందే.
ఇక ఈ సినిమాలో ధనుష్ తన కెరీర్‌లో తొలిసారిగా బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నాడు.
శేఖర్ కమ్ముల టేకింగ్‌కు ధనుష్ అద్భుతమైన నటన తోడైతే, ప్రేక్షకులకు ఇది ఒక విజువల్ ట్రీట్ అనే చెప్పాలి.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆసియన్ సినిమాస్ బ్యానర్‌పై ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు.
Details
ఇప్పటికే కుబేర హైప్ క్రియేట్ చేసిందిలా..!
ఇప్పటికే 'కుబేర' నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ధనుష్ బిచ్చగాడి గెటప్‌లో కనిపించగా, నాగార్జున ఓ బిజినెస్ టైకూన్ పాత్రలో కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
ఇదే కోవలో విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
తాజాగా మేకర్స్ 'కుబేర' రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.
శేఖర్ కమ్ముల ఇప్పటివరకు ప్రేమ కథలు, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నా, ఈసారి తన స్టైల్ మార్చుకుని మాస్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు.
దీంతో 'కుబేర' ధనుష్‌కు తెలుగులో మరో బిగ్ హిట్ అందించే అవకాశం ఉంది.
Details
శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్‌లో జరుగుతున్నాయి.
ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న 'కుబేర' తమిళం, తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.