Page Loader
Kuberaa Movie Review : 'కుబేర' సినిమా సమీక్ష.. ఓ బిచ్చగాడి జీవితం చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ కథ 
'కుబేర' సినిమా సమీక్ష.. ఓ బిచ్చగాడి జీవితం చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ కథ

Kuberaa Movie Review : 'కుబేర' సినిమా సమీక్ష.. ఓ బిచ్చగాడి జీవితం చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ కథ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2025
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన 'కుబేర' చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.

వివరాలు 

కథ సమీక్ష: 

బంగాళాఖాతంలో దేశం మొత్తానికి 15 ఏళ్ళు సరిపడా ఆయిల్ నిధి దొరుకుతుంది.

దీన్ని తన కంట్రోల్‌లోకి తీసుకొనాలనే ఆలోచనతో నీరజ్ మిత్రా (జిమ్ సార్బ్) ప్రభుత్వంతో ఒప్పందాలకు ప్రయత్నిస్తాడు.

కానీ ఈ ప్రాజెక్టు సాధించాలంటే కేంద్రానికి చెందిన పెద్ద అధికారులందరికీ కలిపి ₹1 లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాల్సి వస్తుంది.

ఇది అధికారికంగా, అనుమానాలు రాకుండా పంపిణీ చేయాలంటే ఓ నిజాయితీగల వ్యక్తి అవసరం పడుతుంది.

అందుకే సీబీఐ అధికారిగా పని చేసిన దీపక్ తేజ (నాగార్జున)ను ఎంపిక చేస్తారు.

దీపక్ నిజాయితీతో పనిచేసే అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నవాడు.కానీ రాజకీయ కుట్రల కారణంగా తప్పుడు కేసులతో జైలుకు పంపిస్తారు.

వివరాలు 

కథ సమీక్ష: 

తన కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో నీరజ్ ఇచ్చిన ప్రతిపాదనను ఒప్పుకుని జైలు నుంచి విడుదలై తన పాత్రను ప్రారంభిస్తాడు.

ఈ డబ్బును హవాలా మార్గంలో పంపేందుకు నాలుగు నగరాల నుంచి దేవా (ధనుష్), దిబియా, ఖేలు, కుష్బూ అనే నలుగురు బిచ్చగాళ్లను తీసుకొచ్చి వారిని బినామీలుగా మారుస్తారు.

వీరి పేర్లపై నకిలీ కంపెనీలు ప్రారంభించి డబ్బును షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేస్తారు.

వారి పని పూర్తైన తర్వాత కొంత డబ్బు ఇచ్చి పంపించేయాలనుకుంటాడు దీపక్. కానీ నీరజ్ మాత్రం వారిని చంపాలని ప్లాన్ చేస్తాడు.

దిబియా, ఖేలు హత్యల తర్వాత దేవా అనుమానం వచ్చి తప్పించుకుంటాడు. అతనిపేరు మీద జరగాల్సిన ₹10,000 కోట్ల లావాదేవీ ఆగిపోతుంది.

వివరాలు 

కథ సమీక్ష: 

దేవా సమీర (రష్మిక మందన్న) అనే యువతిని కలుస్తాడు. ఇక దేవా కోసం నీరజ్ మనుషులు, దీపక్ ఇద్దరూ గాలింపు మొదలుపెడతారు.

దీంతో కథ ఉత్కంఠంగా మలుపు తిరుగుతుంది. దేవా ఎలాగైనా బతికి బయటపడతాడా? లక్ష కోట్ల ప్రాజెక్ట్ పూర్తవుతుందా? సమీర ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వీరిద్దరూ కలసి ఏం చేయబోతున్నారు? దీపక్‌కు ఈ హత్యలు తెలిసినప్పుడు అతను ఎలా స్పందిస్తాడు? గర్భవతైన కుష్బూని రక్షించగలరా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే.

వివరాలు 

విశ్లేషణ

శేఖర్ కమ్ముల గతంలో అనామిక వంటి థ్రిల్లర్ తర్వాత మళ్ళీ 'కుబేర'తో మిగిలిన జానర్లకు భిన్నంగా సస్పెన్స్ థ్రిల్లర్‌కు పునరాగమనం చేశారు.

ప్రాథమికంగా ఇది ధనవంతుడు వర్సెస్ బిచ్చగాడు కథలా ప్రచారం చేసినా,వాస్తవంగా ఇది ఓ బిచ్చగాడి జీవితం చుట్టూ తిరిగే కథగా సాగుతుంది.

ఫస్ట్ హాఫ్‌లో పాత్రలు పరిచయం,బిచ్చగాళ్లను ట్రైనింగ్ ఇవ్వడం, అనంతరం హత్యలు జరిగే పరిణామాలతో సాగుతుంది.

దేవా తప్పించుకున్న తర్వాత కథలో కొంత టెంపో తగ్గినట్టు అనిపిస్తుంది.

ఇంటర్వెల్ ముందు భాగం కొద్దిగా బోర్ ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం గట్టి థ్రిల్లర్‌ ఫీలింగ్‌తో సాగుతుంది.

దేవా ఎలా తప్పించుకుంటున్నాడో,సమీర అతనితో కలిసి ఎలా ముందుకు సాగుతుందో ఆసక్తికరంగా చూపించారు.

వివరాలు 

విశ్లేషణ

డబ్బు, రాజకీయ లంచాల నేపథ్యంలో కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్‌లా కథ సాగినప్పటికీ, ప్రతి కీలక దృశ్యంలోనూ బిచ్చగాళ్ల జీవిత పరిస్థితులు చర్చకు వస్తాయి.

ఫిల్మ్ నిడివి ఎక్కువగా ఉండటం కొంత బలహీనత. కొన్ని సీన్స్ అప్పటికే ఎడిటింగ్ లో తొలగించినట్లు అనిపిస్తుంది.

టీజర్‌లో ఉన్న కొన్ని దృశ్యాలు థియేటర్లలో కనిపించవు. నాగార్జున తన పాత్రకు వచ్చిన ఎండింగ్ ఒప్పుకోవడం అభినందించదగ్గ విషయం.

రష్మిక - ధనుష్ మధ్య సీన్స్ కొన్నిచోట్ల కామెడీని తేలికగా జోడించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేశారు.

కానీ క్లైమాక్స్ ఇంకేదో ఉంటుంది అని ఆశిస్తే సింపుల్ గా ముగించేశారు అనిపిస్తుంది.

వివరాలు 

నటీనటుల పర్ఫార్మెన్స్..

ధనుష్ బిచ్చగాడి పాత్రలో జీవించేసారు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పాత్రకు న్యాయం చేశాయి.

తిరుపతిలో నిజంగా అడుక్కుంటూ నటించినందుకు ఆయనకు ప్రత్యేక శభాష్ చెప్పాలి.

నాగార్జున ఓ రిటైర్డ్ సీబీఐ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. తాను చేసిన తప్పు గురించి లోలోపల పంచుకునే బాధను ఆయన నటన బాగా ప్రతిబింబించింది.

రష్మిక నూతన కోణంలో కనిపించి ఆకట్టుకుంది. జిమ్ సార్బ్ నెగెటివ్ షేడ్స్‌లో బాగా నటించారు.

మిగిలిన బిచ్చగాళ్లుగా కనిపించిన నటులు తమ పాత్రల్లో బాగానే నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

వివరాలు 

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ ఆకట్టుకుంటాయి. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు బాగుంది.

రెండు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, రష్మిక పాటను ఎడిటింగ్‌లో తొలగించారు.

ఫస్ట్ హాఫ్‌లో కొంత దృశ్యాలను కత్తిరించి ఉంటే మెరుగయ్యేది. ముంబై, తిరుపతి వంటి నిజమైన లొకేషన్లలో చిత్రీకరించటం సినిమాకు పాజిటివ్ అంశం.

'కుబేర' సినిమా డబ్బు చుట్టూ తిరిగే కథ అయినప్పటికీ, చివరకు ఒక బిచ్చగాడి జీవన ప్రయాణమే ఆత్మగా నిలుస్తుంది.

సీరియస్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కమర్షియల్ భావనతో కాకుండా మెసేజ్‌తో కూడినదిగా రూపొందించబడింది.

థ్రిల్లింగ్ ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు ఇది ఓ మంచి ప్రయోగాత్మక చిత్రం.