LOADING...
Nagarjuna: కొండా సురేఖ పై నాగార్జున పరువునష్టం దావా.. విచారణ వాయిదా 
కొండా సురేఖ పై నాగార్జున పరువునష్టం దావా.. విచారణ వాయిదా

Nagarjuna: కొండా సురేఖ పై నాగార్జున పరువునష్టం దావా.. విచారణ వాయిదా 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 04, 2024
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) కుటుంబ వ్యక్తిగత విషయాలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు (Konda Surekha Comments) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో నాగార్జున, కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది, ఇక సోమవారం విచారణ జరగనుంది.

వివరాలు 

అసలేం జరిగిందంటే.. 

కొండా సురేఖ బుధవారం మీడియాతో మాట్లాడినప్పుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై (KTR) విమర్శలు చేస్తూ, సమంత, నాగచైతన్య, నాగార్జున (Nagarjuna) పేర్లను ప్రస్తావించారు. ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావించిన ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబం, సినీ పరిశ్రమకు చెందిన పలువురు, సమంత కూడా స్పందించారు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు, ఆధారాల్లేని ఆరోపణలను చూస్తూ ఉండబోమని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని పలువురు విమర్శించారు. ఆగ్రహం వ్యక్తం కావడంతో, కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.