Page Loader
Namitha : నమిత భర్త ఇలాంటివాడా.. పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారంటే
నమిత భర్త ఇలాంటివాడా.. పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారంటే

Namitha : నమిత భర్త ఇలాంటివాడా.. పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారంటే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 15, 2023
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ బొద్దు గుమ్మ, హాట్ హీరోయిన్ నమిత భర్త వీరేంద్ర వివాదంలో ఇరుక్కున్నారు. ఈ మేరకు అతనిపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే విచారణకు రావాలంటూ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో వీరేంద్రకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తమిళనాడుకు చెందిన గోపాల్ స్వామి అనే వ్యక్తిని వీరేంద్ర మోసం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్‌ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్‌ పదవి ఇప్పిస్తానని గోపాల్‌ స్వామి నుంచి దాదాపు రూ. 50 లక్షల వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే తనను మోసం చేశారని బాధితుడు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. దీంతో వీరేంద్రకు నోటీసులు జారీ అయ్యాయి.

DETAILS

వీరేంద్ర చౌదరి నమిత భర్త కాబట్టే తమిళనాడులో జోరుగా చర్చ

ఈ కేసులో వీరేంద్ర విచారణకు హాజరుకావాల్సిందిగా మరో ఇద్దరు వ్యక్తులకు సేలం సెంట్రల్‌ క్రైమ్ బ్రాంచి సమన్లు పంపినట్లు తెలుస్తోంది. ముత్తురామన్‌ అనే వ్యక్తికి ఛైర్మన్ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి, అమ్మాపాళయం జాకిర్‌ ప్రాంతానికి చెందిన గోపాల్‌స్వామి నుంచి రూ. 50 లక్షల మేర వసూలు చేశాడని సమాచారం. ఇటీవలే ఆ పదవిని వీరేంద్ర చౌదరి చేపట్టడంతో గోపాల్‌ స్వామి పోలీసులను ఆశ్రయించారు. కేసులో ముత్తురామన్‌ సహా కౌల్సిల్ తమిళనాడు ప్రెసిడెంట్ దుశ్యంత్ యాదవ్‌ను అక్టోబర్ 31నే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో వీరేంద్రచౌదరి నమిత భర్త కాబట్టి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇక తమిళనాట నమితకు ఫ్యాన్స్ గుడి కట్టడం గమనార్హం.