Page Loader
Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణ ? ఇక దబిడి దిబిడే..!
బిగ్ బాస్ హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణ ? ఇక దబిడి దిబిడే..!

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణ ? ఇక దబిడి దిబిడే..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2023
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిగ్ బాస్ తెలుగు సో ఏడు సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే ఈ షోకు ఇప్పటివరకూ మొత్తం ముగ్గురు హీరోలు హోస్ట్ లుగా చేశారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, న్యాచులర్ స్టార్ నాని, అక్కినేని నాగార్జున హోస్ట్ లుగా వ్యవహరించారు. తాజాగా బిగ్ బాస్ షోకు సంబంధించి హోస్ట్ మారుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే రోజు రోజుకూ బిగ్ బాస్ షోకు ఆదరణ తగ్గుతోందని తెలుస్తోంది. ఇక హిందీలో, తమిళ్ లో పొలిస్తే తెలుగులో రేటింగ్ చాలా తక్కువగా ఉందంట. దీనికి కారణం నాగార్జుననే అని అంతా భావిస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఈసారీ హోస్ట్‌గా పెడితే రేటింగ్ అదిరిపోతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోంది.

Details

స్పందించని బిగ్ బాస్ యాజమాన్యం

రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య బాబుకు ఉన్న ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బాలకృష్ణ పదునైన మాటలతో కంటెస్టెంట్లను ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంది. మరోవైపు తన కామెడీ టైమింగ్‌తో పక్కా బిగ్ బాస్‌కు న్యాయం చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్‌గా మారాయి. దీనిపై బిగ్ బాస్ యాజమాన్యం ఇంతవరకూ స్పందించలేదు. అయితే బాలయ్య బాబు షో చేసేందుకు వస్తారా లేదా అన్నది వేచి చూడాలి.