Page Loader
OG : ఓజీ'లో మూవీలో నారా రోహిత్‌కు కాబోయే భార్య.. క్లారిటీ ఇచ్చిన నటుడు!
ఓజీ'లో మూవీలో నారా రోహిత్‌కు కాబోయే భార్య.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

OG : ఓజీ'లో మూవీలో నారా రోహిత్‌కు కాబోయే భార్య.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ డ్రామా చిత్రం 'ఓజీ' (OG) నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. ఇటీవలే నారా రోహిత్‌కు కాబోయే భార్య శిరీషా ఈ సినిమాలో నటించనున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై స్వయంగా నారా రోహిత్‌ క్లారిటీ ఇచ్చారు. 'భైరవం' సినిమా ప్రమోషన్‌లో భాగంగా సాయి దుర్గాతేజ్‌తో కలిసి నిర్వహించిన సరదా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రోహిత్‌ వెల్లడించారు. టాలీవుడ్‌ నటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, నారా రోహిత్‌, మంచు మనోజ్‌ నటించిన 'భైరవం' సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ ఇంటర్వ్యూ జరిగింది.

Details

సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్

ఈ సందర్భంగా సాయి దుర్గాతేజ్‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రోహిత్‌ మాట్లాడుతూ- 'ఓజీలో నాకు కాబోయే భార్య శిరీషా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోందని స్పష్టం చేశారు. ఇంతకాలం ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదని మంచు మనోజ్‌ నారా రోహిత్‌ను సరదాగా ఆటపట్టించడంతో ఇంటర్వ్యూలో నవ్వులు వెల్లువెత్తాయి. ఈ సమయంలో OG సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ కూడా స్వయంగా రోహిత్‌ చెబుతుండటంతో, అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం 'ఓజీ' చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. చివరి దశ పనుల్లో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తుండగా, ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయికగా కనిపించనున్నారు.