Nargis Fakhri's sister: మాజీ బాయ్‌ఫ్రెండ్ హత్య చేసిన కేసులో బాలీవుడ్ నటి సోదరి అరెస్టు
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియా ఫక్రీని అమెరికాలో అరెస్టు చేశారు. ఆమెపై జంట హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఉన్నాయి. న్యూయార్క్ పోలీసులు ఇటీవల అలియాను అరెస్టు చేశారు. గత నెలలో, ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్, అతని స్నేహితురాలిని సజీవ దహనం చేసినట్లు సమాచారం అందింది. న్యూయార్క్‌లో నివసిస్తున్న అలియా ఫక్రీ, కొంతకాలం ఎడ్వర్డ్ జాకోబ్ అనే యువకుడితో డేటింగ్‌లో ఉన్నారు. అయితే, ఈ జంట మధ్య మనస్పర్థాలు రావడంతో, ఒక సంవత్సరానికి ముందు వారిద్దరూ విడిపోయారు. అనంతరం, జాకోబ్ అనాస్టాసియా ఎటినీ అనే యువతితో పరిచయమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న అలియా, జాకోబ్‌పై అనేక సార్లు బెదిరించినట్లు వార్తలు ఉన్నాయి.
సోదరి అరెస్టుపై స్పందించని నర్గీస్ ఫక్రీ
నవంబర్ 2న, అలియా, జాకోబ్, అతని స్నేహితురాలు నివసిస్తున్న భవనానికి వెళ్లి ఆ ఇంట్లో నిప్పు పెట్టింది. స్థానికులు ఈ ఘటనను గమనించి వారిని అప్రమత్తం చేశారు.కానీ, అప్పటికే మంటల్లో చిక్కుకున్న వారు ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసిన న్యూయార్క్ పోలీసులు ప్రత్యక్ష సాక్షుల నుండి సమీకరించిన సమాచారంతో అలియాను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె దోషిగా తేలితే,ఆమెకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె రిమాండ్‌లో ఉంది. ఈ కేసు విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేశారు. అయితే, నర్గీస్ ఫక్రీ ఇప్పటివరకు తన సోదరి అరెస్టుపై స్పదించలేదు.