
Vijay Deverakonda: విజయ్ నెక్స్ట్ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక.. ఫ్యాన్స్‌లో జోష్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం యువ హీరోలు సాధారణ కథలకు బదులుగా నూతనమైన, వినూత్నమైన కాన్సెప్ట్‌లను ఎంచుకుంటున్నారు.
ఈ దిశగా ముందుగానే అడుగులు వేసిన నటుడు విజయ్ దేవరకొండ, తన సినీ ప్రయాణంలో ఎప్పుడూ విభిన్నతను చాటుతూ వస్తున్నాడు.
తెలుగు ప్రేక్షకులతో పాటు పొరుగు భాషల వారిని కూడా ఆకట్టుకుంటున్న విజయ్, ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక స్పై థ్రిల్లర్ చిత్రమైన 'కింగ్డమ్'ను చేస్తున్నాడు.
ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇక ఈ చిత్రం అనంతరం విజయ్ చేసే రెండు సినిమాలు ఇప్పటికే అధికారికంగా ఖరారయ్యాయి.
మొదటిగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో గ్రావిటీ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాలో నటించనున్నాడు.
Details
త్వరలో అధికారిక ప్రకటన చేయనున్న మైత్రీ మేకర్స్
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. ఇతర చిత్రం విషయానికి వస్తే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ మరో సినిమా చేయనున్నాడు.
ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్ కథతో తెరకెక్కనుంది.
గతంలో విజయ్-రాహుల్ కాంబినేషన్‌లో వచ్చిన టాక్సీవాలా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో, ఈ కాంబోపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఆమె పాత్ర ఖరారైనట్టే తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది.