Page Loader
Rashmika: నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌ నా కాలేజ్‌ రోజుల్లోనే ప్రారంభమైంది: రష్మిక
నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌ నా కాలేజ్‌ రోజుల్లోనే ప్రారంభమైంది: రష్మిక

Rashmika: నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌ నా కాలేజ్‌ రోజుల్లోనే ప్రారంభమైంది: రష్మిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2025
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. 2016లో తన తొలి చిత్రం 'కిరిక్‌ పార్టీ' విడుదలైనప్పటి నుంచే 'నేషనల్‌ క్రష్‌' అనే టైటిల్‌ వచ్చిందన్నారు. అంతకంటే ముందే చదువుకునే రోజుల్లో మ కాలేజీ మొత్తానికి తానే క్రష్‌ అని, ఆ తర్వాత 'కర్ణాటక క్రష్‌'గా మారానన్నారు. సినిమాల్లోకి రాగానే 'నేషనల్‌ క్రష్‌' అయ్యానని చెప్పింది. ఎవరో వచ్చి మీరు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నారని చెప్పినప్పుడు తనకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుందని రష్మిక చెప్పుకొచ్చారు. .

Details

ఫిబ్రవరి 14న ఛావా రిలీజ్

ప్రస్తుతం ఛావా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రష్మిక, ఈ చిత్రంపై కూడా మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. శంభాజీ మహారాజ్‌ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన సతీమణి 'యేసు బాయి' పాత్రలో రష్మిక నటించారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. యేసు బాయి పాత్ర చేయడం చాలా ప్రత్యేకమైన అనుభూతి అని, తొలుత ఈ అవకాశం వచ్చినప్పుడు ఆశ్చర్యపోయానని చెప్పారు.

Details

ఇలాంటి పాత్ర చేయడం జీవితాంతం గుర్తిండిపోతోంది

దక్షిణాదికి చెందిన తనను మహారాష్ట్ర మహారాణిగా నటించేలా అవకాశం ఇచ్చారని, కెరీర్ పరంగా ఇది తనకు ఇది ఎంతో ప్రత్యేకమైన మూవీ అని చెప్పారు. ఈ పాత్ర కోసం చాలా శ్రమించానని, భాష నేర్చుకోవడానికి చాలా నెలలు పట్టిందన్నారు. ఇలాంటి పాత్ర చేయడం జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటిస్తున్న కుబేర, సికందర్, థామా, ది గర్ల్‌ఫ్రెండ్‌, రెయిన్‌బో చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.