Page Loader
Allu Arjun: నాట్స్‌ 2025.. తెలుగువారంటే ఫైర్‌ అనుకున్నారా..? వైల్డ్‌ ఫైర్‌!
నాట్స్‌ 2025.. తెలుగువారంటే ఫైర్‌ అనుకున్నారా..? వైల్డ్‌ ఫైర్‌!

Allu Arjun: నాట్స్‌ 2025.. తెలుగువారంటే ఫైర్‌ అనుకున్నారా..? వైల్డ్‌ ఫైర్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 06, 2025
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా వేదికగా జరిగిన 'నాట్స్‌ 2025' (నార్త్‌ అమెరికన్‌ తెలుగు సొసైటీ) కార్యక్రమంలో తెలుగు సినీ తారలు ఆకట్టుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, దర్శకుడు సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌, నటి శ్రీలీల పాల్గొన్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రేక్షకులతో మమేకమై, వారి అభిమానం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పుష్ప' స్టైల్‌లో బన్నీ మెసేజ్‌ తెలుగు ప్రజల కృషి, ప్రతిభను ప్రస్తావిస్తూ అల్లు అర్జున్‌ తనదైన శైలిలో మాట్లాడుతూ తెలుగు వారంటే ఫైర్‌ అనుకున్నారా? వైల్డ్‌ ఫైర్‌ అని 'పుష్ప' తరహాలో డైలాగ్‌ పేల్చారు.

Details

గర్వంగా ఉంది

ఈ వేదికపై భాగస్వామిగా ఉండడం గర్వంగా ఉందని అల్లు అర్జున్ చెప్పారు. నాట్స్‌ ఈవెంట్‌కు వచ్చినప్పుడల్లా ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. ఇంతమంది తెలుగువారిని చూస్తుంటే హైదరాబాద్‌, విశాఖలో ఉన్నట్లే ఫీల్ అవుతుంటుంది. మన తెలుగు సంస్కృతిని విదేశాల్లో కొనసాగిస్తున్నందుకు ప్రతి ఒక్కరికీ అభినందనలు. నాట్స్‌ గురించి 'పుష్ప' శైలిలో చెప్పాలంటే - 'నాట్స్‌ అంటే నేషనల్‌ అనుకుంటివా? ఇంటర్నేషనల్‌!'. ప్రపంచం ఎక్కడైనా మన తెలుగువారు అస్సలు తగ్గేదేలే అని పేర్కొన్నారు.

Details

రాఘవేంద్రరావు - దర్శక ప్రయాణం, ప్రశంసలు

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ఇది నా 50 ఏళ్ల దర్శక ప్రస్థానంలో ఒక అద్భుత ఘట్టం. నేను పరిచయం చేసిన బన్నీ, శ్రీలీల ఇక్కడ ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. సుకుమార్‌తో నాకు ఒక పోలిక ఉంది - అదే గడ్డం (నవ్వులు). నేను 'అడవి రాముడు'లో అడవిని నమ్మి స్టార్‌ డైరెక్టర్‌ అయ్యాను. నువ్వు 'పుష్ప'లో అడవిని నమ్మి స్టార్‌ డైరెక్టర్‌ అయ్యావు. అల్లు అర్జున్‌ని స్టార్ హీరోగా తీర్చిదిద్దావు అని వివరించారు.

Details

సుకుమార్‌ - అమెరికన్‌ తెలుగు అభిమానులకు కృతజ్ఞతలు 

దర్శకుడు సుకుమార్‌ తన ప్రసంగంలో అమెరికాలోని తెలుగు అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "ఈ వేదిక ద్వారా రెండు విషయాలు చెప్పాలి. మొదటగా నా చిత్రం '1 నేనొక్కడినే'ను ఇక్కడి ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అదే నాకు మరొక సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అది నా కెరీర్‌కు కీలక మలుపు. రెండవది - తెలుగు సినీ పరిశ్రమకు నవీన్‌ అనే నిర్మాతను ఇచ్చినందుకు. మైత్రి మూవీస్‌ నిర్మించిన ఎన్నో సినిమాలు ఎంతో మందికి ఉపాధి కల్పించాయి. దీనికోసం మీకు ధన్యవాదాలని అన్నారు.