LOADING...
Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా?
మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా?

Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యువ హీరో నవీన్‌ పోలిశెట్టి కెరీర్‌లో కీలక మలుపు తిరిగే అవకాశం దక్కనుందా? ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఆయనకు నటించే ఛాన్స్ దక్కబోతోందన్న వార్తలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఇండియన్ సినిమా బుక్‌లో స్థిరమైన స్థానం సంపాదించుకున్న మణిరత్నం, రజనీకాంత్‌, కమలహాసన్‌ వంటి దిగ్గజాలతో విజయం సాధించిన దర్శకుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్, శింబు, త్రిష, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన 'థగ్ లైఫ్' చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక మణిరత్నం తదుపరి చిత్రం ఏదో అన్న ఉత్కంఠ సినీ వర్గాల్లో నెలకొంది.

Details

హీరోయిన్ గా సాయిపల్లవి?

తాజాగా ఈ నేపథ్యంలో నవీన్ పోలిశెట్టిని హీరోగా తీసుకుని, తెలుగు-తమిళ భాషల్లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించేందుకు మణిరత్నం సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి విజయవంతమైన చిత్రాలతో నవీన్ మంచి క్రేజ్‌ను సంపాదించారు. ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించనున్నారన్న ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇంకా ఒక హాట్ బజ్ ఏమిటంటే, ఈ సినిమాలో సాయి పల్లవిని కథానాయికగా ఎంపిక చేయాలన్న ఆలోచనలు మణిరత్నం టీంలో నడుస్తున్నాయట. కానీ ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎంతవరకు నిజమో త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ క్రేజీ కాంబినేషన్‌పై అభిమానులు ఊహాగానాలతో మునిగిపోతున్నారు.