14 Years Of Samantha: కథానాయికగా పధ్నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సమంత.. అభినందనలు తెలిపిన నయనతార
టాలీవుడ్ లో 'ఏమాయ చేశావె' చిత్రంతో పరిచయమైన సమంత తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయంలో తిష్ట వేసుకుని కూర్చుంది. అతి తక్కువ సమయంలో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకొని హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2010 లో, సమంతా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తమిళ చిత్రం 'విన్నైతాండి వరువాయా'లో అతిధి పాత్రతో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అయితే, అదే సంవత్సరం తెలుగులో 'ఏ మాయ చేసావే'లో ఆమె తన మొదటి ప్రధాన పాత్రను పోషించింది. 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
ఇంస్టాగ్రామ్ స్టేటస్‌లో వీడియోషేర్ చేసిన సమంత
ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే సౌత్ ఇండియా అగ్ర కథానాయిక, లేడీ సూపర్‌స్టార్ నయనతార సామ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసి, 'సమంత నటిగా మీకు మరింత పవర్ రావాలి'' అంటూ పేర్కొన్నారు. సమంత కూడా నయనతారకు థ్యాంక్స్ చెప్పారు. 14yearsofSamanthalegacy x లో ట్రెండింగ్‌లోఉంది. అప్పుడే పధ్నాలుగేళ్లా... ఓ కలలా లేదు అంటూ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఓ క్యూట్ వీడియో ఇంస్టాగ్రామ్ స్టేటస్‌లో షేర్ చేసింది సమంత. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.