Page Loader
NBK 109: బాలకృష్ణ NBK 109లో ఆడిపాడనున్న ఇద్దరు బ్యూటీలు ఎవరో తెలుసా
బాలకృష్ణ NBK 109లో ఆడిపాడనున్న ఊర్వశి

NBK 109: బాలకృష్ణ NBK 109లో ఆడిపాడనున్న ఇద్దరు బ్యూటీలు ఎవరో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 06, 2023
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కేఎస్ రవీంద్ర( బాబీ కొల్లి ) దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇటీవలే చిత్రీకరణ సైతం ప్రారంభమైంది. అయితే బాలకృష్ణ 109వ సినిమాలో ఇద్దరు కథానాయికలను ఎంపిక చేశారు.ఈ మేరకు బాలయ్య సరసన మీనాక్షీ చౌదరి కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని సినీవర్గాల్లో చర్చ సాగుతోంది. బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య'లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ప్రత్యేక గీతం చేశారు.ఇప్పుడు బాలకృష్ణ సినిమాలోనూ ఆమె ఆడిపాడనున్నారని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ,ఊర్వశిపై కీలక సన్నివేశాలు తీస్తున్నారట.సీన్లతో పాటు సాంగ్ కూడా ఉండనుందట. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తుండగా, త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య, నాగవంశీ నిర్మాతలు.

DETAILS

NBK : ఎన్‌బీకే 109 కాన్సెప్ట్ పోస్టర్‌లో మారణాయుధాలు 

ఎన్‌బీకే 109 కాన్సెప్ట్ పోస్టర్‌లో మారణాయుధాలు చాలా ఉన్నాయి. వీటికి తోడు 'వయలెన్స్ కి విజిటింగ్ కార్డు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో డిఫరెంట్ యాక్షన్ సీన్లు తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. కత్తులతో పాటు ఆ సూట్ కేసులో మందు బాటిల్ కూడా ఉంది. అది మ్యాన్షన్ హౌస్ బాటిల్ కావడం గమనార్హం. అంతేకాదు సిగరెట్, డబ్బులకూ చోటు కల్పించడం కొసమెరుపు. గత సినిమా భగవంత్ కేసరి సినిమాకు మారణాయుధాలు, మందు, సిగరెట్.. వీటితో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది జూన్ 10న పూజా కార్యక్రమాలు మొదలెట్టిన బాలయ్య కొత్త సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బాలయ్య కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో ఆట పాట